వాట్సాప్ కొత్త ఫీచర్...గ్రూప్ అడ్మిన్లకు రిలీఫ్ !

By: Madhavi Lagishetty

యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు కంపెనీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వాట్సాప్ 2.17.70బీటా అప్ డేట్...ఈ గ్రూప్ కాల్స్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్...గ్రూప్ అడ్మిన్లకు రిలీఫ్ !

అయితే ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ కాల్స్ విషయంలో కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. గ్రూప్ మేనేజ్ మెంట్ను మరింత మెరుగ్గా చేయడానికి మరికొన్ని ఫీచర్లు యాడ్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది.

గ్రూప్ లోని ఇతర అడ్మినిస్ట్రేటర్లు...గ్రూప్ క్రియేటర్ను తీసేయకుండా చేసే ఫీచర్ కూడా ఇందులో ఒకటిగా చెప్పవచ్చు. సబ్జెక్, ఒపినియన్, స్టేటస్, మార్చడం వంటి చర్యలను గ్రూప్ లోని సభ్యులను ఎంచుకోగలరు. @Webetalnfo పోస్ట్ ప్రకారం...కొత్త ఫీచర్ తాజా వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.17.387లో రోలవుట్ చేయబడుతుంది.

నవంబర్ 11న రెడి‌మి నోట్ 5, ఫీచర్స్ ఇవే..?

@Webetalnfo రిపోర్ట్ ప్రకారం...గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం వెర్షన్ 2.17.387లో వాట్సాప్ సమర్పించింది. గ్రూప్ మేనేజ్ మెంట్ కోసం, గ్రూప్ అడ్మిన్ రక్షించే ప్రయత్నంలో గ్రూప్ డీపీని మార్చడం సహా ఇదతర విషయాలను ఎడిట్ చేసే సభ్యులను ఎంచుకునే అవకాశనిచ్చింది. దీని ద్వారా గ్రూపులో ఏదైనా పోస్టును , మెసేజ్ లను ఇతర గ్రూప్ అడ్మిన్ లు డిలీట్ చేసే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తోందని రిపోర్టులో తెలిపింది. ప్రస్తుతం పరీక్షలో దశల్లో ఉంది. ఇది సక్సెస్ అయితే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ వినియోగదారులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అన్ సెండ్ ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిలీట్ ఫర్ ఎవ్రీన్ వన్ ఫీచర్ ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు WABetainfo వెబ్ సైట్ బ్లాగ్ మరియు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ ఫీచర్ తో వినియోగదారులు తాము సెండ్ చేసిన టెక్స్ట్స్ , ఇమేజెస్, వీడియోలు, గిఫ్, డాక్యుమెంట్లు ఐదు నిమిషాల్లోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది.

వీటన్నింటితోపాటు, యూజర్లు UPI పేమేంట్స్ చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ లోవాట్సాప్ బేటా 2.17.295లోకూడా గుర్తించబడింది.

Read more about:
English summary
WhatsApp is likely to roll out more features to group admins soon so that the management of the groups becomes simple.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot