బ్లాక్... ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’!!!

Posted By: Super

బ్లాక్... ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’!!!

 

అంతర్జాతీయ బ్రాండ్లలో ఒకటైన హెచ్‌పీ(హెవ్లెట్ ప్యాకర్డ్) ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తూ అత్యాధునిక ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే డెస్క్‌టాప్ పీసీలతో, నోట్‌బుక్, నెట్‌బుక్ పీసీలను విడుదల చేసి పాపులరైన ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ తాజగా ‘బ్లాక్ 2000-329WM’ వర్షన్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఆధారిత ల్యాపీని ప్రవేశపెట్టి క్రేజ్‌ను మరింత పెంచుకునే యోచన చేస్తోంది.

‘బ్లాక్ 2000-329WM’ ఫీచర్లు :-

- 15.6 అంగుళాల హై -డెఫినిషన్ బ్రైట్ వ్యూ స్క్ర్రీన్,

- విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టమ్,

- AMD E350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- AMD Radeon 6310 HD గ్రాఫిక్ కార్డ్, మెమరీ 1461MB,

- 3జీబీ DDR3 ఎస్డీ ర్యామ్,

- 302 జీబీ సాటా హార్డ్ డ్రైవ్,

- సూపర్ మల్టీ డివీడీ బర్నర్,

- 168 గంటల పాటు హైడెఫినిషన్ వీడియో లేదా 91,000 పాటలను స్టోర్ చేసుకోవచ్చు.

- లాన్, వై-ఫై సామర్ధ్యం,

- సుపీరియర్ సౌండ్ కోసం ‘ఆల్టెక్ లాన్సింగ్ స్పీకర్’,

- 2-in-1 మెమరీ కార్డ్ రీడర్,

- ఐదున్నర గంటల బ్యాటరీ బ్యాకప్,

- ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot