భలే మౌస్.. చేతి స్పర్శకే చకా చకా స్పందిస్తుంది!!

Posted By: Staff

భలే మౌస్.. చేతి స్పర్శకే చకా చకా స్పందిస్తుంది!!

 

కన్స్యూమర్ ఎలక్ర్లానిక్ షో 2012 అద్బుత ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. గత నెల 10,13 తేదీల మధ్య లాస్‌వేగాస్‌లో ప్రతిష్టాతక్మంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనేక గ్యాడ్జెట్ తయారీ సంస్థలు తమ ప్రతిభను ఈ వేదిక పై చాటుకున్నాయి.

వినూత్న ఆవిష్కరణలతో నిత్యం వార్తల్లో నిలిచే లాగిటెక్ సంస్థ క్యూబ్ మోడల్లో టచ్ సెన్సిటివ్ మౌస్‌ను రూపొందించింది. ఈ మౌస్ పరిమాణం (రెండు అంగుళాల పొడవు, ఒక అంగుళం వెడల్పు), లెఫ్ట్, రైట్ క్లిక్కులు చేయాల్సిన అవసరం లేదు మౌస్ పైన కుడి, ఎడమ భాగాల్లో తాకితే చాలు చేతి స్పర్శకే ఈ మౌస్ స్పందిస్తుంది. అంతేకాదండోయ్! ప్రెజంటేషన్ ఇచ్చే సందర్భంలో ఈ మౌస్‌ను రిమోట్‌లో ఉపయోగించుకోవచ్చు. మైక్రో యూఎస్బీ వ్యవస్థ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవల్సి ఉంటుంది. విలువ రూ.3,500 ఉండొచ్చని అంచనా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot