అణిచివేత మొదలైందా..?

Posted By: Super

 అణిచివేత మొదలైందా..?

‘టెక్ దిగ్గజాలైన సామ్ సంగ్, ఆపిల్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న వైరం రసవత్తరంగా మారింది. వినియోగదారులను ఆకట్టకునే ప్రయత్నంలో ఒకిరికి మించి మరొకరు ఎత్తలకు పైఎత్తులు వేసుకుంటున్నారు’

ప్రముఖ గ్యాడ్జెట్ నిర్మాణ సంస్థ సామ్‌సంగ్, ఆపిల్ ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో నిరోధించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామ్‌సంగ్ ప్రవేశపెట్టిన ‘గెలాక్సీ ఎస్3’ స్మార్ట్‌ఫోన్ కేవలం రెండు నెలల వ్యవధిలో కోటి యూనిట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరో ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘గెలాక్సీ నోట్’విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా సామ్‌సంగ్ చేపట్టబోతున్న మరో ఆవిష్కరణ ‘ఆపిల్ కొత్త ఐప్యాడ్’కు సవాల్ విసిరేదిగా ఉంది. రెటీనా తరహా డిస్‌ప్లేతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్ల‌ను 2012 చివరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు జూలై 30న బహిర్గతమైన సామ్‌సంగ్ కోర్టు డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.

ఫీచర్లేంటి..(అంచనా)?

11.8 అంగుళాలు రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 2,560x 1,600పిక్సల్స్) ,

16:10 స్ర్కీన్ రేషియో, వై-ఫై, ఎల్‌టీఈ సామర్ధ్యం.

సామ్‌సంగ్ రూపొందిస్తున్న టాబ్లెట్ కోడ్‌నేమ్ ‘పీ10’.

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ Exynos 5250 ప్రాసెసింగ్ యూనిట్(క్లాక్ వేగం 2గిగాహెట్జ్),

పోటీ ఏలా ఉండబోతోంది..?

సామ్‌సంగ్ తాజా వ్యూహం టెక్ దిగ్గాజాలైన ఆపిల్ ఇంకా మైక్రోసాఫ్ట్‌లకు సవాల్ విసిరినట్లయ్యింది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 ఆధారితంగా స్పందిచే మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్‌లు ఇప్పటికే టాబ్లెట్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. టాబ్లెట్ పీసీల విభాగాన్ని గత కొంత కాలంగా శాసిస్తున్న ఆపిల్ ‘కొత్త ఐప్యాడ్’ పై పూర్తి భరోసాతో ఉంది. సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రెటీనా టాబ్లెట్ ‘పీ10’ఆపిల్ ఆధిప్యతాన్ని ఏవిధంగా నిలువరిస్తుందో వేచి చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot