ఢిల్లీ బ్రాండ్ నుంచి కొత్త టాబ్లెట్ ‘జెన్ టాబ్ 708బీహెచ్’

Posted By: Prashanth

ఢిల్లీ బ్రాండ్ నుంచి కొత్త టాబ్లెట్ ‘జెన్ టాబ్ 708బీహెచ్’

 

ఢిల్లీకి చెందిన ప్రముఖ టెక్ సంస్థ జెన్ ఫోకస్ తాజాగా ‘జెన్ టాబ్ 708బీహెచ్’ పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని ఆఫర్ చేస్తోంది. 708బీహెచ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందిస్తుంది. 1.2 గిగాహెర్జ్ సింగిల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజ్‌లో వినియోగించారు. నిక్షిప్తం చేసిన మాలీ 400 గ్రాఫిక్ యూనిట్ ఉత్తమ క్వాలిటీ గ్రాఫిక్ అనుభూతులను చేరువ చేస్తుంది. 512ఎంబి ర్యామ్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

7 అంగుళాల కెపాసిటివ్ 5-పాయింట్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, మౌస్ ఇంకా కీబోర్డ్ సపోర్ట్, డాంగిల్ సపోర్ట్‌తో 3జీ నెట్‌వర్క్‌ను ఆస్వాదించవచ్చు. డివైజ్ ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. హెచ్‌డి‌ఎమ్‌ఐ టీవీ అవుట్ పోర్ట్ సాయంతో టాబ్లెట్‌ను హైడెఫినిషన్ పరికరాలకు అనుసంధానం చేసుకోవచ్చు. 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల వై-ఫై బ్రౌజింగ్ టైమ్, 5 గంటల వీడియో గేమింగ్ టైమ్),

అదనపు ఫీచర్లు (డిక్షనరీ, క్యాలక్యులేటర్, 3డి గేమ్స్ ఇంకా ఆండ్రాయిడ్ ఆప్లికేషన్స్). ధర అంచనా రూ. 7,899 నుంచి రూ. 8,000 మధ్య. లింక్ అడ్రస్. మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot