మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకొవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనసరి చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మార్చి 31, 2018లోపు ప్రతి ఒక్కరు తమ బ్యాంక్ అకౌంట్లను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవల్సి ఉంది.

మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకొవటం ఎ

ఇలా చేయని పక్షంలో ఆయా బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ లిస్టులో ఉంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ ఆధార్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్‌లతో లింక్ అయి ఉందో లేదో తెలుసుకోడానికి ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

స్టెప్ 1

ముందుగా ఆధార్ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన www.uidai.gov.inలోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2

ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత 'Check Aadhaar & Bank Account Linking Status' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ఇప్పుడు ఓపెన్ అయ్యే స్టేటస్ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 4

పైన పేర్కొన్న ప్రొసీజర్ విజయవంతంగా పూర్తయిన వెంటనే మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు OTP కోడ్ పంపబడతుంది.

స్టెప్ 5

ఫోన్‌కు వచ్చిన OTP కోడ్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి 'Login' బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో లేదో తెలిసిపోతుంది.

మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంక్ - ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలంటే..?

స్టెప్ 1

ముందుగా మీ మొబైల్ ఫోన్ నుంచి *99*99*1# కోడ్‌కు డయల్ చేయండి.

స్టెప్ 2

కాల్ కనెక్ట్ అయిన తరువాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 3

ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత, కన్ఫర్మేషన్ నిమిత్తం మరోసారి మిమ్మల్ని చెక్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ మీరు తప్పు ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే తప్పులను సవరించుకునే వీలుంటుంది.

స్టెప్ 4

ఆధార్ నెంబర్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయినది లేనేదీ తెలపబడతుంది.

ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్న టాప్ 8 Xiaomi స్మార్ట్‌ఫోన్లు ఇవే !

English summary
A few days back, the Indian government has made some mandatory changes to verify and link Aadhaar of their customers with their accounts on Banks. We have compiled both the ways below for your reference
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot