ఇక మీదట లైసెన్సు లేని ఆన్‌లైన్‌ బూతు నవలలు కనిపించవ్...

Posted By: Super

ఇక మీదట లైసెన్సు లేని ఆన్‌లైన్‌ బూతు నవలలు కనిపించవ్...

బీజింగ్: ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అలాంటి చైనాలో ఇటీవల కాలంలో బూతు‌కి సంబంధించినటువంటి నవలలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా దర్శనమిస్తుండడంతో చైనా ప్రభుత్వం చైనా మొత్తం మీద దాదాపు 43 ఆన్‌లైన్ బూతు నవలలను నిషేదించడం జరిగింది. ఈ విషయంపై బీజింగ్ కల్చరల్ లా ఎన్పోర్సమెంట్ ఏజెన్నీ అధికారి జిన్హూ మాట్లాడుతూ 24 వెబ్ సైట్లలలో అనధికారికంగా ఉంచినటువంటి కంటెంట్‌ని తోలగించడమే కాకుండా వాటిపై యాక్షన్ కూడా తీసుకోనున్నామని తెలిపారు.

8 వెబ్ సైట్లు ఐతే సెక్సుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కూడా మానివేశాయి. స్మార్ట్ ఫోన్స్, టాబ్లేట్ కంప్యూటర్స్, ఈ - బుక్స్ ద్వారా ఎవరైనా సరే బూతుకు సంబంధించిన నవలలుకానీ, మెటీరియల్‌‌గానీ చూడడం, డౌన్ లోడ్ లాంటివి చేసినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసలు మొబైల్స్‌లలో ఇలాంటి మెటీరియల్ ఓపెన్ కాకుండా చూసేందుకు కూడా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

ఐతే శృంగార వెబ్‌సైట్ల ఆగడాలను నియంత్రించే దిశగా వాటి కోసం .XXX డొమైన్‌ పేరుకు తుది ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాల వ్యవహారాలను పర్యవేక్షించే ఐసీఏఎన్‌ఎన్‌ పెద్దవాళ్లకు సంబంధించిన విషయాలు ఉండే వెబ్‌సైట్లకు మాత్రమే ఈ పేరును వాడతారు. శృంగార వెబ్‌సైట్లు కొత్త డొమైన్‌ పేరుతో నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త డొమైన్‌ పేరుతో నమోదు చేయించుకునే వెబ్‌సైట్లు ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల శృంగార వెబ్‌సైట్లను సందర్శించే వారికి వైరస్‌, క్రెడిట్‌కార్డు మోసాలు, సమాచార చోరి తదితర అంశాల బెడద ఉండదనే నమ్మకం కలుగుతుందని ఐసీఏఎన్‌ఎన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐతే దీనిపై మనదేశంలో ఐటి శాఖాకి సంబంధించినటువంటి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ మనదేశంలో మాత్రం బూతు సైట్లకోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఈ .xxx డోమైన్‌ని బ్లాక్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది మనదేశంలో ఉన్నటువంటి ఐటి యాక్ట్ మరియు ఇండియన్ లాస్‌కు విరుద్దంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా మన ప్రక్క దేశాలు అయినటువంటి ఇండోనేషియాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot