ఇండియా మొత్తం ఫోన్‌ల సంఖ్య 95కోట్లు!

Posted By: Staff

ఇండియా మొత్తం ఫోన్‌ల సంఖ్య 95కోట్లు!

దేశంలో మొబైల్ కస్టమర్ల సంఖ్య 2012 మార్చి చివరి నాటికి 2.68శాతం పెరిగి 95.13 కోట్లకు చేరింది. ఇంటర్‌నెట్ చందాదారుల సంఖ్య కూడా ఇదే కాలంలో 2.10 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరింది. టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి యూజర్ల సంఖ్య 92.65 కోట్లు. మొత్తం వైర్‌లెస్ కనెక్షన్లు (జీఎస్‌ఎం, సీడీఎంఏ కలిపి) జనవరి-మార్చ్ క్వార్టర్లో 2.83% పెరిగి 91.91 కోట్లకు చేరగా, వైర్‌లైన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య మాత్రం 3.26 కోట్ల నుంచి 3.21 కోట్లకు క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 62.05 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 33.08 కోట్లకు చేరింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 1.33కోట్ల నుంచి 1.38 కోట్లకు చేరింది.

2014 నాటికి 25 కోట్లు!

2014నాటికి దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. మొబైల్ హ్యాండ్‌సెట్లకు డిమాండ్‌కు సంబంధించి ఐసీఏ అంచనాలను మంత్రి ఆ సమాధానంలో వివరించారు. ఆ వివరాల ప్రకారం… ప్రస్తుత సంవత్సరంలో 20 కోట్ల మొబైళ్లకు (వీటి విలువ రూ.43,000 కోట్లు) డిమాండ్ ఉంటుంది. 2011లో ఈ డిమాండ్ 18 కోట్లకు(రూ.38,200 కోట్లు) ఉండగా. 2010లో 15 కోట్లుగా(రూ.34,500 కోట్లు) ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot