త్వరలో కొత్త హొమ్ పేజితో దర్శనమివ్వనున్న ట్విట్టర్

Posted By: Staff

త్వరలో కొత్త హొమ్ పేజితో దర్శనమివ్వనున్న ట్విట్టర్

ట్విట్టర్ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో బ్లాగింగ్ సైట్. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదరణ పొందండి. 2008 మేలో ట్విట్టర్ కు 13 లక్షల మంది వాడకందారులుండగా ఇప్పుడు 3 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. ట్విట్టర్‌ గురించి టూకీగా చెప్పుకోవాలంటే..'ఇప్పుడు మీరేం చేస్తున్నారు?' అన్న చిన్న ప్రశ్న..అంతే సంక్షిప్తంగా 140 అక్షరాలలో సమాధానం..మిత్రులతో అనుసంధానం. అంతే!

నిజానికి ఇది ఓ సామాజిక వెబ్‌సైట్‌. మనం మనకు తెలిసినవారితోనూ, నచ్చితే కొత్తవారితోనూ మనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునేందుకు వీలు కల్పించే వెబ్‌సైట్లను సామాజిక వెబ్‌సైట్లుగా వ్యవహరిస్తారు. ప్రారంభంలో ఫేస్‌బుక్‌, యువ్‌ట్యూబ్‌, బ్లాగర్‌, ఆర్క్యుట్‌..వంటి సామాజిక వెబ్‌సైట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటన్నింటిని అధిగమిస్తూ ఇప్పుడు ట్విట్టర్‌ హవా కొనసాగిస్తోంది.

Twitter Before:

Twitter After:

జీవం పోసుకుంది ఇలా..

అమెరికా సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు జాక్‌ డోర్సీ ట్విట్టర్‌ రూపకర్త. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ట్విట్టర్‌ ఐఎన్‌సి సంస్థకు ప్రస్తుతం ఆయనే ఛైర్మన్‌. వ్యవస్థాపక సహచరులైన ఎవాన్‌ విలియమ్స్‌ ఈ కంపెనీకి సిఇఒగానూ, బిజ్‌స్టోన్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌గాను జాక్‌కు సహకరిస్తున్నారు. జాక్‌ పనిచేసిన ఒడియో కంపెనీ బోర్డు సమావేశంలో ఒకరోజంతా జరిగిన మేథోమధన సదస్సులో ట్విట్టర్‌ జీవం పోసుకుంది. అప్పటివరకు సెల్‌ఫోన్లలో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న ఎస్‌ఎంఎస్‌‌‌లను సమూహంగా పరస్పరం పంచుకునేందుకు వీలు కల్పించాలన్న ఆలోచనను జాక్‌ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆ ఆలోచనకు అంతర్జాల రూపమే ట్విట్టర్‌.

అలాంటి ట్విట్టర్ హొమ్ పేజి ఇప్పుడు త్వరలో ఓ సరిక్రోత్త రూపుని దిద్దుకోబోతుంది. గతంలో రూపోందించినటువంటి ట్విట్టర్ హొమ్ పేజికి కొన్ని మెరుగులు దిద్ది త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా రూపోందించినటువంటి ఈహొమ్ పేజి అభిరుచులను బట్టి వారి యొక్క హీరోలను లేదా ప్రముఖులను ఫాలో అయ్యే విధంగా రూపోందించడం జరిగింది. ఈకొత్త లేఅవుట్ వల్ల ట్విట్టర్ ఎకౌంట్ కలిగిన వారు అభిరుచులను బట్టి మిగతావారిని ఫాలో అవడం జరుగుతుంది.

గతంలో గనుక మనం చూచుకున్నట్లైతే పేరుని లేక యూజర్ నేమ్‌ని బట్టి ఫాలో అవ్వడం జరుగుతుంది. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి లేఅవుట్ వల్ల మీ అభిరుచిలకు, ఆసక్తికి దగ్గరగా ఉన్నవాళ్శను ఫాలో అవ్వడానికి ఈజీగా ఉండేవిధంగా రూపోందిచడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot