నిర్లక్ష్యం వద్దు మిత్రమా!

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో మనిషి తన రోజువారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతో కొంత టెక్నాలజీ ఆధారపడుతున్నాడు. టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

Read More : 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 95% ఇండియన్ ఇంజినీర్లు పనికిరారు'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రైవింగ్ సమయంలో మొబైల్ చాటింగ్ వద్దు

డ్రైవింగ్ సమయంలో మొబైల్ చాటింగ్ మీ దృష్టిని పూర్తిగా మరల్చి వేస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ పై పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది.

డ్రైవింగ్ సమయంలో ఫోన్‌లో మాట్లాడకండి

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం. ఈ చర్య ప్రమాదాలకు కారణమవుతోంది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను మీకుదూరంగా ఉంచండి.

రూ.10కే వై-ఫై డేటా, కిరణా షాపుల్లోనే వోచర్లు

బాత్‌రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా..?

చాలా మంది తమ ఫోన్‌లను బాత్‌రూమ్‌లలో సైతం విడిచిపెట్టి ఉండలేరు. ఈ చర్య అంత మంచిదేమి కాదు. బాత్‌రూమ్‌లోనూ ఫోన్ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు.

హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిర్లక్ష్యంగా ఉండొద్దు..

గత ఎనిమిది సంవత్సరాల కాలంలో దాదాపు 108 మంది ఇలా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎదురుగా వెనక నుంచి ఏం వస్తున్నాయో తెలియక చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.

‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 95% ఇండియన్ ఇంజినీర్లు పనికిరారు'

ఫేస్‌బుక్ ఎక్కువుగా వాడేస్తున్నారా..?

ఫేస్‌బుక్ వాడకం ఎక్కువయితే వారికి బ్రెయిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కామెంట్లు అలాగే లైకులు ఇవి వారిని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు.

కంప్యూటర్ ముందు అదేపనిగా కూర్చుంటున్నారా..?

కంప్యూటర్ ముందు కూర్చుని అదేపనిగా టైప్ చేయడం వల్ల మణికట్టు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. వీటితోపాటు వెన్నుపూస నొప్పి, అలాగే మొడనొప్పులనేవి సర్వసాధారణమే. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల మీకు తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఫేస్‌బుక్, వాట్సాప్‌‌లలో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా..?

రేడియేషన్ ముప్పు కూడా తప్పదు..

స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ లేకుంటే ఓ రకమైన డిప్రెషన్ లోకి కూడా వెళతారు.కాబట్టి ఫోన్ వీలయినంత తక్కువగా వాడటం మంచిది.

రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

ఎన్నో రకాల బ్యాక్టీరియాలు..

ఫోన్ పై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతుంటాయి. వాటివల్ల మనకు అనేర రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధులు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. ఫోన్‌తో అలర్జీ భారీన పడి ఇప్పటికే చాలామంది డాక్టర్లను కూడా సంప్రదించారు.కాబట్టి, ఫోన్‌ను తాకినప్పుడు చేతులను శుభ్రంగా కడక్కువటం మంచది. అదే విధంగా ఫోన్‌ను చెవికి దగ్గరగా పెట్టుకోకుండా, స్పీకర్ ఆన్ చేసి లేకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడ్డం మంచిది.

పక్కవారి గురించ కూడా ఆలోచించండి..

బస్సుల్లో, రైళ్లలో, రోడ్లపై.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పక్కనున్న వారి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా కొందరు ఫోన్‌లో అదే పనిగా మాట్లాడేస్తుంటారు.ఆఫీసుల్లో, సమావేశాల్లో, బహిరంగస్థలాల్లో ఇతరులు విసుక్కొనేలా కొందరు సెల్‌లో బిగ్గరగా మాట్లాడుతుంటారు. పక్కవాళ్లు ఏమనుకుంటారన్న ఇంగితం లేకుండా పెద్ద సౌండ్‌తో కొందరు మొబైల్‌లో పాటలు వింటుంటారు. పాటలు వినాలన్న ఆసక్తి ఉన్న వారు ‘ఇయర్ ఫోన్లు' పెట్టుకుంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

USB Type-C గురించి 5 ఆసక్తికర విషయాలు

బిల్లులు చెల్లించే సమయంలోనూ ఫోన్ విడిచిపెట్టడం లేదా..?

క్యాష్ కౌంటర్ వద్ద బిల్లు చెల్లించే సమయంలోనే ఫోన్ లావాదేవీల్లో మునిగితేలుతున్నారా..?ఈ పద్దతికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇలాంటి సమయాల్లోనే మీ నిర్లక్ష్యాన్ని చనువుగా తీసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

ఇక పాస్‌వర్డ్ లేకుండా మైక్రోసాఫ్ట్ అకౌంట్లలోకి లాగిన్ కావొచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech Mistakes to Avoid Everyday in Your Life. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot