కోటి దాటిన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు!

Posted By: Prashanth

కోటి దాటిన ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు!

 

ఎల్‌జీ, స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తమ ఎల్- సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ మార్క్‌ను దాటినట్లు కంపెనీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆప్టిమస్ ఎల్3, ఎల్5, ఎల్7 ఇంకా ఎల్ 9 మోడళ్లు విక్రయాల పెరుగుదలలో తోడ్పాడునందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మోడళ్లో డ్యూయల్ సిమ్ వేరియంట్‌లైన ఎల్3 ఇంకా ఎల్5 ఫోన్‌లను ప్రత్యేకించి భారతీయుల కోసం ఎల్‌జి డిజైన్ చేసింది. 2012 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయమైన ఎల్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏడాదికాలంలోనే ఈ ఘనతను సాధించటం పట్ల ఎల్‌జీ మొబైల్ విభాగం హర్షం వ్యక్తం చేస్తోంది. పైన పేర్కొన్న ఎల్ సిరీస్ మోడళ్లలో ‘ఆప్టిమస్ ఎల్9’ను తాజాగా ఇండియన్ మార్కెట్లో ప్రకటించారు. ధర అంచనా రూ. 23,000. స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

2013… గూగుల్ మెగా ఈవెంట్ వివరాలు!

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4.7 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

2150ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

స్కానర్ అప్లికేషన్ (క్యూ-ట్రాన్స్ లేటర్).

ఎల్ సిరీస్ నుంచి మరిన్నిమోడళ్లను భవిష్యత్ లో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot